
పయనించే సూర్యుడు ఆగస్టు 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి లో సోమవారం జడ్పీ హైస్కూల్ నందు తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి పాఠశాల ఆవరణమంతా కలియతిరిగి, విద్యార్థినీ విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయ అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, కొన్ని మరుగుదొడ్లకు డోర్లు సరిగా లేవని ఆసంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం పాఠశాల ఆవరణము లో మధ్యాహ్న భోజనం పథకాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ వారికి తెలియజేశారు, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లకు సరైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే వైద్యులు చెప్పాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు. కమలపాడు రోడ్డులోని ముస్లిం షాది ఖానా, సంత మార్కెట్లోని కళ్యాణ మండపమును పరిశీలించి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సోమవారం కావడంతో మార్కెట్ వచ్చిన వారితో శాసనసభ్యులు వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మెయిన్ రోడ్ నుండి సంత మార్కెట్ కు వెళ్లే దారి అంతా బురదమయం కావడంతో సి.సి. రోడ్డుకు తగిన నిధులు విడుదల చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రుద్రమ నాయుడు. మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య. టౌన్ ప్రెసిడెంట్ వెలిగొండ్ల ఆదినారాయణ. బీసీ సెల్ అధ్యక్షులు తీరం పురం నీలకంఠ. సుబహాను. లియో విశ్వనాధ్, సెల్ పాయింట్ చాందు భాష. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
