
హుజురాబాద్ బి ఆర్ ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అంజాదుళ్ల ఖాన్
పయనించే సూర్యడు // మార్చ్ // 3// హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. రంజాన్ మాసం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే నెల అని ఇది త్యాగం, ప్రార్థన, క్షమాభిక్ష, పరస్పర ప్రేమను పెంపొందించే గొప్ప సమయం.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసాలు (రోజాలు) పాటిస్తూ, ప్రార్థనలు చేస్తూ, తమ ఆత్మీయ సాధనను మరింతగా బలోపేతం చేసుకునేదని హుజురాబాద్, బి ఆర్ ఎస్ మైనార్టీ నాయకులు మహమ్మద్ అంజాదుళ్ల ఖాన్ పేర్కొన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించినట్లు ముస్లిం విశ్వాసం. అందుకే ఇది భక్తి, పుణ్యం,అల్లాహ్‌కు సమీపించుకునే అదృష్టమైన సమయంగా పరిగణించబడుతుంది. రంజాన్‌లో ముస్లింలు ఉదయం సహర్ (ఉపవాసం ప్రారంభం) నుంచి సాయంత్రం ఇఫ్తార్ (ఉపవాస విరామం) వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం పాటిస్తారు. అలాగే, తమ ఆలోచనలు స్వచ్ఛంగా ఉంచుకుంటూ, మంచి పనులు చేయడంపై దృష్టి పెడతారని అన్నారు.రోజా అనేది కేవలం శారీరక ఉపవాసం మాత్రమే కాదు, అది మనస్సును పవిత్రం చేసుకోవడానికి, సహనాన్ని పెంచుకోవడానికి,మానవత్వాన్ని దర్శించడానికి ఒక గొప్ప సాధనంగా మారుతుంది. ఇది ఓర్పు, క్షమాభిక్ష,మానవతా విలువలను బలపరచే పవిత్ర ఆచారం వారు వివరించారు.
రంజాన్‌లో సేవా కార్యక్రమాలు.. ఈ నెలలో ముస్లింలు జకాత్ (దానం) అందిస్తూ, పేదలకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. సామాజిక సేవలు, భిక్షాదానం, ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించడం ఈ నెలలో మరింత ప్రాముఖ్యత పొందుతుందని పేర్కొన్నారు. ఈ పవిత్రమైన రంజాన్ మాసం ప్రతి ఒక్కరికీ ఆనందం, శాంతి,పుణ్యం కలిగించాలి. ముస్లిం సోదరులు,సోదరీమణులకు రంజాన్ ముబారక్! అల్లాహ్ మీ ప్రార్థనలను ఆలకించి, మీ కుటుంబాలకు ఆరోగ్యం, సుఖసంతోషాలు కలిగించాలి ఆకాంక్షించారు.