
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 15 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం.
చట్టి గ్రామపంచాయతీ ఆఫీస్ నందు జరిగిన 79వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు అనంతరం చట్టి గ్రామ పెసా గ్రామసభ తీర్మానం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలతో ఉన్నటువంటి 26 జిల్లాలను 32 జిల్లాలుగా విభజించే ప్రక్రియలో ఏజెన్సీ పాడేరు జిల్లా నుండి కొన్ని ఏజెన్సీ మండలాలను కలుపుతూ రంపచోడవరాన్ని రాజమహేంద్రవరంలో కలపాలని వస్తున్న వాదనలు సరైనది కాదని ఇప్పటికే ఏజెన్సీలో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అమలు కాని పరిస్థితి కాబట్టి ప్రభుత్వ పాలకులు, అధికారులు, ఏజెన్సీ ప్రాంతాలను రాజమహేంద్రవరం జిల్లాలో కలిపే ఆలోచన మానుకొని ఏజెన్సీ మండలాలు మొత్తాన్ని కలిపి రం పచోడవరం కారం. తమన్న దొర పేరుమీద ప్రత్యేక ఏజెన్సీ జిల్లాగా ప్రకటించాలని ప్రస్తుత ASR జిల్లా చింతూరు మండలం. చట్టి గ్రామస్తులందరూ పెసా గ్రామ కమిటీ గ్రామసభ తీర్మానం ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శి వారికి ఉన్నత అధికారులకు తెలియజేయవలసిందిగా కోరుతూ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవ్వ.భద్రమ్మ, ఉప సర్పంచ్ తుర్రం. రాముడు, పెసా కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు తుర్రం. చిన్న ముత్తయ్య, కార్యదర్శి పోడియం. రామకృష్ణ గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.