
ఏపీ సీఎం 2014 నాటి హామీ రంపచోడవరం నియోజకవర్గం,పోలవరం నియోజకవర్గం ముంపు మండలాలను కలుపుతూ ప్రత్యేక రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలి.
రాజమండ్రిలో కలిపితే సహించం.
ఎస్టి కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి వినతి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 25
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం మండల కేంద్రంలోని యు.టి.ఎఫ్ హోమ్ నందు ఏపీ ఆదివాసీ జేఏసీ కోరు కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని అంశంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగాఏపీ ఎస్టీ కమిటీ చైర్మన్ సోళ్ళ బొజ్జి రెడ్డి హాజరయ్యారు.ఈ సమావేశానికి పోలవరం నియోజకవర్గం,రంపచోడవరం నియోజకవర్గం ప్రతినిధులతో రంపచోడవరం జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.రంపచోడవరం జిల్లా సాధన కమిటీ జిల్లా చైర్మన్ గా పల్లాల రాజ్ కుమార్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరియు పోలవరం నియోజకవర్గం రంపచోడవరం నియోజకవర్గం ప్రతినిధులతో జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతినిధులందరూ రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని 2014 నాటి ఏపీ సీఎం హామి పోలవరం నియోజకవర్గం,రంపచోడవరం నియోజకవర్గం కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని ఉపన్యాసం ద్వారా డిమాండ్ చేశారు.అనంతరం ఏపీ ఎస్టి కమిటీ చైర్మన్ సోళ్ళ సోజ్జి రెడ్డికి రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు.ఈ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో అన్ని ఆదివాసి సంఘాల నాయకులు,ప్రజా సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు,మహిళలు,యువతీ యువకులు మొదలైన ఆదివాసి మేధావులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని ఈరోజు నుండే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఏపీ ఆదివాసీ జేఏసీ సెంట్రల్ కమిటీ సమన్వయకర్త మడివి నెహ్రూ,తెల్లం శేఖర్,కారం రామన్న దొర,చవలం శుభ కృష్ణ దొర,మడకం వరప్రసాద్ దొర,కర్రీ సన్యాసి రెడ్డి,సార్ల మంగిరెడ్డి మాజీ సర్పంచ్,వంతు బాలకృష్ణ,మద్దేటి అంజిరెడ్డి,చెదల దినేష్ రెడ్డి,శీలం తమయ్య,జల్లి నరేష్,దూసరి కనక దుర్గ,సార్ల రమాదేవి సర్పంచ్,మాజీ ఎంపీపీ అన్నం సత్యనారాయణ రెడ్డి,మాజీ జడ్పిటిసి పల్లాల వెంకటరమణారెడ్డి,మద్దేటి జగన్నాథ్ రెడ్డి,లోత మంగమ్మ, కత్తుల రత్నారెడ్డి,కుండ్ల రామి రెడ్డి,కోండ్ల విజయ్ కుమార్ రెడ్డి,మట్ల కృష్ణారెడ్డి,మణికంఠ,అందాల సూర్య నారాయణరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.
