
ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 11
పూర్తి ఆదివాసి జిల్లా గా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపితే ఉద్యమం తీవ్రతరం అవుతుందని ఆదివాసి సంక్షేమ(274/16) పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మీడియా ద్వార హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జిల్లాల పునర్విభజన పోస్ట్ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రంపచోడవరం నియోజకవర్గం రాజమండ్రిలో కలిపే ఆలోచన మానుకోవాలని ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులను కోరారు. ఆదివాసులు ఉండే జిల్లాలను విభజనలు చేయాలంటే ఆదివాసి చట్టాలకు ఆదివాసి మనోభావాలకు అనుగుణంగా చేయాలి గాని నాన్ ట్రైబల్స్ కి అనుగుణంగా రంపచోడవరం నియోజకవర్గం మైదాన ప్రాంతాల్లో కలిపితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. వై రామవరం మండలాన్ని ప్రభుత్వం రెండు మండలాలుగా విభజించడం కోసం జీవో జారీ చేయడం పట్ల ఆదివాసి సంక్షేమ పరిషత్ హర్షిస్తుంది ఇటువంటి మండలాల విభజనలు ఏజెన్సీ ప్రాంతాల్లో మరిన్ని జరగాల్సిన అవసరం ఉందని భౌగోళిక పరిస్థితులు ఆధారంగా మండల స్థాయిలో పరిపాలన సౌలభ్యం కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని పెద్ద మండలాలను రెండు లేదా మూడు మండలాలుగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆదివాసి ప్రజలు కూడా రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రి జిల్లాలో కలిపే కుట్రలను తిప్పికొట్టాలని ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో మైదాన ప్రాంత నాన్ ట్రైబల్స్ వలసలు వచ్చి ఏజెన్సీలోని భూభాగాలను ఆక్రమించి ఏజెన్సీ మండల కేంద్రాలన్నీ నాన్ ట్రైబల్స్ వ్యాపార సముదాయాలుగా మార్చేసుకున్నారని ఆదివాసి జిల్లాగా ఉండటం వల్ల భవిష్యత్తులోనైనా ఆదివాసులకు మంచి జరిగే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు జిల్లాని అటానమస్ జిల్లాగా ఏర్పాటు చేయటానికి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నాన్ ట్రైబల్స్ మరియు ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలకు ఆదివాసులు బల్లి పశువులు అవ్వొద్దని,స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రాల పేరుతోటి జిల్లాల పేరుతోటి విభజించే సమయంలో ఆదివాసీలే బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాని ఆదివాసుల అదృష్టంగా భావించాలని దాని కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మనం దేన్నీ కాపాడుకోలేమని ఆదివాసులకు ఆయన సూచించారు. రంపచోడవరం నియోజకవర్గం పై జరుగుతున్న కుట్రను అడ్డుకోవటానికి ఆదివాసీలంతా సిద్ధంగా ఉండాలని ప్రతి గ్రామం నుండి రంపచోడవరం నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలిపే ప్రతిపాదనని వ్యతిరేకించేలా నిరసనలు పత్రికా ప్రకటనలు ధర్నాలు మొదలు పెట్టాలని ఆయన తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో నియోజకవర్గం పునర్ విభజనలో భాగంగా ST పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.