Sunday, July 27, 2025
Homeఆంధ్రప్రదేశ్రంపచోడవరం సబ్ కలెక్టర్ నిర్లక్ష్యంతో ఏజెన్సీ చట్టాలు నీరు గారి పోతున్నాయని ఆదివాసి సంక్షేమ పరిషత్...

రంపచోడవరం సబ్ కలెక్టర్ నిర్లక్ష్యంతో ఏజెన్సీ చట్టాలు నీరు గారి పోతున్నాయని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆరోపణ

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ 26


శనివారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్((274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ రంపచోడవరం మండలం నరసాపురం లో గల మెటల్ క్వారీపై చర్యలు తీసుకోవాలని పలుదాపాలుగా ఐటీడీఏ పీవో గారికి రంపచోడవరం సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతోటి జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ కు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ ఫిర్యాదు ఆధారంగా మెటల్ క్వారీపై సమగ్ర విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక అందజేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ నోటీసు జారీ చేసింది . మెటల్ క్వారీపై ముందుగా గ్రామస్తులు గౌరవ ఐటిడీపీఓ గారికి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసి సరిగ్గా ఈ రోజుకు రెండు నెలలు గడిచిందని అనంతరం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నరసాపురం గ్రామస్తులు ఆదివాసి సంక్షేమ పరిషత్ సంఘాన్ని ఆశ్రయించి అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకునేలా అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరగా తమ సంఘం ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో గారికి మరియు రంపచోడవరం సబ్ కలెక్టర్ గారికి 30/06/2025 నా ఫిర్యాదు చేయడం జరిగిందని ఆ తర్వాత రంపచోడవరం ఏడి మైనింగ్ వారిని సంయుక్త దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందని కానీ పిఓ గారు స్పందించినప్పటికీ సబ్ కలెక్టర్ గారు ఏ డి మైనింగ్ గారు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అనంతరం గత సోమవారం మళ్లీ గ్రీవెన్స్ లో నర్సాపురం గ్రామస్తులతో కలిసి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో పి ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అయితే పి ఓ గారు సబ్ కలెక్టర్ గారిని దీనిపై చర్యలు తీసుకోవాలని నేను ఇదివరకే చెప్పి ఉన్నానని తెలపగా గ్రామస్తులు, ఆదివాసి నాయకులు సబ్ కలెక్టర్ గారు ఏడి మైనింగ్ గారు రాలేదని వీఆర్వో ఆర్ఐలు వచ్చి ఏదో మాయమాటలు చెప్పి వెళ్లిపోయారని అనగా పిఓ గారు దానిపై స్పందించి వీఆర్వో గారికి మెమో జారీ చేయాలని తెలిపి ఉన్నారు అని ఆయన తెలియజేశారు. ఫిర్యాదు చేసిన రోజు తమ ముందే సబ్ కలెక్టర్ గారికి పిఓ గారు ఫోన్ చేసి నరసాపురం మెటల్ క్వారిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని వారి అక్రమంగా నడుస్తున్నట్లయితే మూసివేయాలని ఆదేశించారు కానీ ఇప్పటివరకు సబ్ కలెక్టర్ గారి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యక్షంగా లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ మరోపక్క ఐటీడీఏ పీవో గారే దర్యాప్తు జరపాలని ఆదేశించినప్పటికీ సబ్ కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంలోనే కాదని రంపచోడవరం సబ్ కలెక్టర్ గారు ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అర్జీలు ఇవ్వటానికి వస్తే అనేకమార్లు దగ్గరకు రానివ్వకుండా దూరంగానే ఆగిపోవాలని చెప్పినట్లు కొంతమంది ప్రజలు తమ దృష్టికి తీసుకు వచ్చారని అందులో ఆదివాసి సంక్షేమ పరిషత్ కార్యకర్త కూడా ఉన్నారని ఆయన తెలియజేశారు. ఆదివాసీలు ఏమి అంటరాని వారు కారని ఒకవేళ మీరు అలా భావిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేయటానికి మీరు అర్హులు కారని ఆయన ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ గారిని విమర్శించారు. ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి సబ్ కలెక్టర్ ఫై విచారణ ఆదేశించాలని లేకుంటే సబ్ కలెక్టర్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం ఆదివాసుల రక్షక భూభాగమని ఇక్కడ ఆదివాసీలకు ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయని వాటిని తెలుసుకొని ఈ ప్రాంతంలో పనిచేయాలని ఆయన అన్నారు. ఏజెన్సీలోని నాన్ ట్రైబల్స్ ఆక్రమాలపై ఫిర్యాదు చేయటానికి వచ్చిన ఆదివాసి కార్యకర్తలు ఏజెన్సీ చట్టాల గురించి తెలియపరుస్తూ ఉంటే చట్టాల గురించి మాకే చెప్తారా? అంటూ సబ్ కలెక్టర్ గారు హేళన చేయడం సరికాదని అయినా ఆవేదన వ్యక్తపరిచారు. నరసాపురం మెటల్ క్వారీపై సమగ్ర విచారణ జరిపి అక్రమంగా కొనసాగుతున్న మెటల్ క్వారీని మూసివేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. అధికారులు నిర్లక్ష్యమే ఏజెన్సీలో ఆదివాసుల పాలిట శాపంగా మారుతుందని ఆదివాసులు అర్జీలు పెట్టి పెట్టి అలసిపోతున్నారు తప్ప అర్జీదారులకు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏజెన్సీ చట్టాలు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. సబ్ కలెక్టర్ గారి నిర్లక్ష్యం పట్ల తమ సంఘం దశల వారి ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఆయన తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments