
పయనించే సూర్యుడు అక్టోబర్ 18 “ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య”
అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తాన్ని అందించిన పోలీస్ అధికారులను అభినందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ తమకు వీలైన సమయంలో రక్తదానం చేయాలని సూచించారు. ఆయన వెంట తాళ్లూరి గిరినాయుడు. ఏలూరు కేశవ చౌదరి. మండల నాయకులు సీఐ. ఎస్సైలు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు