
- కమలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్..
పయనించే సూర్యడు // మార్చ్ // 18 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
కమలాపురం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ మాట్లాడుతూ..కమలాపురం మండల నిరుద్యోగ యువతీ యువకులకు, తెలంగాణా రాష్ట్రంలో ఎర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతీ యువకులకు సామజిక ఆర్ధిక భరోసా అందించడం జరుగుతుంది అన్నారు. అందువలనా ఎస్సీ, ఎస్టీ బీసీ , మైనారిటీ, నిరుద్యోగ యువతకి రాజీవ్ యువ వికాస్ పథకం ద్వారా 3 లక్షల ఆర్థిక భరోసా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి 60-80% సబ్సిడీతో అవకాశంని కల్పించడం జరుగుతుంది, అన్నారు.కాబట్టి ఇట్టి దరఖాస్తును ఏప్రిల్ 5 వరకు గడువు ఉన్నందున కమలాపురం మండల నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, నిరుద్యోగ యువత ఉపాధి పొందాలని, కమలాపూర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్ తెలిపారు.