
పయనించే సూర్యుడు మే 5 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా
బాల్కొండ నియోజకవర్గం: వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న మానాల మోహన్ రెడ్డి (రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు).ఈ సందర్బంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని,గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో,లేవో అని నేరుగా ఈరోజు వారి వద్దకే వెళ్లి తెలుసుకున్నారు.ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకే చేరే విధంగా కృషి చేస్తున్నారని,అందులో ముఖ్యంగా మహిళకు ఉచిత బస్సు సౌకర్యం,500సబ్సిడీ సిలిండర్, రైతులకు సన్న ధాన్యానికి 500/-బోనస్, అర్హులైన రైతులకు రెండు లక్షల రుణ మాఫి, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి పథకం ద్వారా 200యూనిట్ల లోపు వాడిన వారికి ఉచిత విద్యుత్, పేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేందర్ వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్ వేల్పూర్ మండల బీసీ సెల్ అధ్యక్షులు రమణ , జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్
, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భూమా రెడ్డి ,బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆత్మరామ్ , అక్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు మల్లారెడ్డి రామన్నపేట్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చిన్నయ్య మోహన్ నితీష్ శోభన్ సృజన్ శ్రీను ,మహేష్ గణేష్ కిషన్ , హరీష్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
