
భూ పోరాటం నిర్వహించిన పేదలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్.
( పయనించే సూర్యుడు మార్చి 27 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండల పరిధిలోని నాగన్ పల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 189, 203 లో 577 మందికి ఇండ్ల పట్టాలు పేదలకు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భూములను రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం కబ్జా చేసింది. పేదలకు మరొక చోట భూములు కేటాయిస్తానని నమ్మించి మోసం చేసింది. అనేక సంవత్సరాలు వేచి చూసిన పేదలు తమకు కేటాయించిన భూముల మీదకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పేదలను అడ్డుకోవడమే కాకుండా లాటి ఛార్జ్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పేదలకు న్యాయం చేయాలని పోరాటం నిర్వహిస్తున్న సిపిఎం.పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. పేదల భూములను కబ్జా చేసిన వారిని వదిలేసి పేదలకు కేటాయించిన భూమిని పేదలకే ఇవ్వాలని పోరాటం నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ని జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య గారిని మరియు ఇతర నాయకులను గాయపరిచి అరెస్టు చేయడం సిగ్గుచేటు.ఇప్పటికైనా ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. మా భూములు మాకు దక్కుతాయని అనేక ఆశలతో ఉన్న పేదలకు ప్రభుత్వం వెంటనే పొజిషన్ చూపించాలని కోరుతున్నాం. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం పేదలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేసి పేదలకున్న భయాందోళనలను తొలగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ పక్షన డిమాండ్ చేస్తున్నాం. అరెస్టు చేసిన సిపిఎం నాయకత్వాన్ని మరియు పేదలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.