
మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్..
పయనించే సూర్యుడు // మార్చి // 19 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇటీవల హుజురాబాద్ పట్టణంలో గల 30 వ వార్డులోని (విద్యానగర్ )నూతన సిసి రోడ్డు కావాలి అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్ బాబు ని అడగగా వెంటనే స్పందించి ఎస్డిఎఫ్ నిధుల నుండి 10 లక్షల రూపాయలను మంజూరు చేయించారు, అని తెలిపారు. ఈ నిధులతో రోడ్డును పెందోట సుధాకర్ ఇంటి నుండి పోరండ్ల సమ్మయ్య ప్లాటు వరకు నూతన సిసి రోడ్డు నిర్మించి పూర్తి చేశామన్నారు. సిసి రోడ్డును కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వొడితల ప్రణవ్, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తో పాటు మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ సాంబరాజు, టౌన్ ప్లానింగ్ అధికారి అశ్విని గాంధీ, , వర్క్ ఇన్స్పెక్టర్ మోటపోతుల వినయ్, మండల అధ్యక్షుడు కిరణ్ లు సందర్శించి రోడ్డు నాణ్యతను గమనించారన్నారు. అడిగిన వెంటనే నా అభ్యర్థనను విని ఎస్డిఎఫ్ నిధులను మంజూరు చేయించిన ప్రణవ్ బాబుకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, మరియు ఒడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో ఇంకా మంచి పనులు జరగాలని, సిఎం రేవంత్ రెడ్డికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో..ఉప్పు శ్రీనివాస్ పటేల్, రేణికుంట్ల సందీప్, ఎర్ర రమేష్, చిట్యాల రేవంత్, మంద బిక్షపతి ( కేఆర్ టైలర్), వార్డు ప్రజలు వంగల సతీష్ బాబు, సబ్బని శివాజీ, తాడూరి రామస్వామి, అక్కోజు కృష్ణ, పబ్బు ఐలయ్య, చిట్టి లక్ష్మారెడ్డి, కొమురవెల్లి సత్యనారాయణ, చందా జగదీశ్వర్, ముశం శ్రీనివాస్, యాంసాని శశిధర్, 30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు, మాడిశెట్టి సమ్మయ్య, పోరండ్ల సమ్మయ్య తో పాటు వార్డు ప్రజలు, కాంట్రాక్టర్లు సంపత్, నవీన్, వార్డు మున్సిపల్ జవాన్ ప్రతాప రాజు, వార్డు ఆఫీసర్ రమేష్, మున్సిపల్ కార్మిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.