Friday, May 9, 2025
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారకులు ఎవరు?ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా.. మేము సిద్ధంగా ఉన్నాం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారకులు ఎవరు?ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా.. మేము సిద్ధంగా ఉన్నాం

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో మే 8 టి కే గంగాధర్


జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సవాల్

గురువారం రోజు కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజు ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు ఆయన అహంకారానికి రాజకీయ అవివేకానికి నిదర్శనమని, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా చేసి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మాట నిజం కాదా అని ప్రశాంత్ రెడ్డి చెప్పాలని ,ప్రశాంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిన ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప సలహాలు సూచనలు ఇచ్చింది లేదని, బిఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థను విచ్చిన్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని సరి చేస్తూ ముందుకు వెళుతున్న క్రమంలో ప్రశాంత్ రెడ్డికి వత్తాసు పలికే కొందరు ఉద్యోగులతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే ఉద్యోగులకు చాలా చేశాను అనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి అలా మాట్లాడడం జరిగిందని, గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను గేటు ముందర నిల్చోబెడితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడు నుండి నాలుగు సార్లు ఉద్యోగులతో చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉంది అని కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ముఖ్యమంత్రి అలా మాట్లాడడం జరిగిందని ఆయన అన్నారు. గతంలో బి ఆర్ ఎస్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా విచ్చిన్నం అవుతున్న సందర్భంలో పాలకవర్గంలో మంత్రులుగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి ఎందుకు బాధ్యత వహించడం లేదు చెప్పాలని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే గ్రామాలలో తిరగకుండా చేస్తామని, ప్రశాంత్ రెడ్డికి ప్రజల పైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో చెప్పాలనుకుంటే చర్చకు వేదిక నిర్ణయించి తెలుపాలని మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. చర్చకు సవాల్ ను స్వీకరించలేని ప్రశాంత్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడడం సరైనది కాదు అని, ప్రశాంత్ రెడ్డిని ప్రజలు హీనంగా చూసే రోజులు వస్తాయని మానాల మోహన్ రెడ్డి అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో రాజ భోగాలు అనుభవించిన ప్రశాంత్ రెడ్డి ఇప్పుడు గ్రామాలలోకి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదని దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని దానిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని ఆయన అన్నారు. ప్రశాంత్ రెడ్డికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే గడిచిన పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలలు మేము చేసిన అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రజావేదిక ఏర్పాటు చేసి బహిరంగ చర్చకు రావాలని ప్రశాంత్ రెడ్డికి మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెం నరసయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూచయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేమ్ గంగాప్రసాద్,కిషన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్,బూచి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments