పయనించే సూర్యుడు ఫిబ్రవరి 1 కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఏరుకుల మహేష్
ఆదోని పట్టణంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో శనివారం రిటైర్డ్ అయిన ఎంఈఓ నాగేశప్ప దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. పట్టణానికి చెందిన నాగేశప్ప ఆలూరు తాలూకా చిప్పగిరి మండల ఎంఈఓగా పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు, బసవరాజ్ ,సతీష్, ఇర్ఫాన్, వెంకటేష్నాయక్, మణికంఠ, మల్లి, లింగ తదితరులు రిటైర్డ్ ఎంతో దంపతులకు శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు.