
రుద్రూర్ తాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సురేందర్ నాయక్…
రుద్రూర్, జూలై 11 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల తహసిల్దార్ గా సురేందర్ నాయక్ ను నియమిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో రుద్రూర్ తాహసిల్దార్ గా విధులు నిర్వహించిన బి.తారాబాయి తాత్కాలిక సెలవు పై వెళ్లడంతో ఆమె స్థానంలో రుద్రూర్ ఉప తహసిల్దార్ గా పనిచేస్తున్న పి.సురేందర్ నాయక్ కి తహసిల్దార్ గా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. శుక్రవారం నాడు రుద్రూర్ మండల సమీకృత సముదాయ భవనం నందు తహసిల్దార్ కార్యాలయంలో సురేందర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. భూ భారతి ఇతర సర్టిఫికెట్లు వివిధ అవసరాల కోసం వచ్చేవారు నేరుగా తనను కలవచ్చని సురేందర్ నాయక్ తెలియజేశారు. విధి నిర్వహణ మార్గదర్శకాలను అనుసరిస్తానని,నేను తహసీల్దార్ గా ఉన్నంతకాలం రైతులకు, విద్యార్థులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు.