
రుద్రూర్ లో సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు..
రుద్రూర్, మార్చ్ 18 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంచుతూ, టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జరిగిన తెలంగాణ శాసన సభ సమావేశంలో కులగణలో భాగంగా బీసీలకు సుమారు 56% ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. బీసీలకు ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, ఉద్యోగ పరంగా గాని, రాజకీయ పర్యంగా గాని బీసీలకు ఎంతో అవకాశం ఇస్తుందన్నారు. అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రిత్వ శాఖలకు, ఎమ్మెల్యేలకు రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నారోజిగంగారం, పత్తి రాము, కర్క అశోక్, ఇందూర్ కార్తీక్, అడప సాయిలు, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, చిక్కడపల్లి రవి, షేక్ నిస్సార్ , పట్టేపు రాములు, సోషల్ మీడియా కన్వీనర్ వడ్ల నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
