
శంభాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 12 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి తెల్ల గోపి) : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద హిందూ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వీరుడు శంభాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శివాజీ మరణం తర్వాత శంభాజీ మహారాజ్ పరిపాలన చేసి ఎన్నో యుద్ధాల్లో తమ పరాక్రమం చూపించిన ధీరశాలి అని కొనియాడారు. శంభాజీ మహారాజ్ తన తండ్రి ఛత్రపతి శివాజీ మాదిరిగానే మంచి పరిపాలన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.