
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 14
15వ తేదీ నుండి చింతూరు ఐటిడిఏ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి చింతూరు డివిజన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయలని జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసారు.
డిమాండ్స్:-
1).తక్షణమే TAC(ట్రైబల్ అడ్వైజరీ కమిటీ)ని ఏర్పాటుచేయాలి.
2).ఏజెన్సీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి.
3).మెగా డీఎస్సీ లో ఉన్న ఏజెన్సీ ఆదివాసీ ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ద్వారా స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలి.
4).ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలి. డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఐటిడిఎ ల వద్ద నిరావధిక రిలే నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, చింతూరు డివిజన్ కమిటీ ఈ నెల 15, గురువారం నుండి చింతూరు ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టానున్నామని తెలియజేశారు. ఈ నిరవదిక రిలే నిరాహార దీక్షలను నిరుద్యోగులు, విద్యావంతులు డి.ఇడి, బి.ఇడి , డిగ్రీ, బి.టెక్, డిప్లొమా, ఇంటర్, అభ్యర్థులు, అలానే వివిధ శాఖల ఉద్యో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు, అన్ని పార్టీల ఆదివాసి ప్రజా ప్రతినిధులు ఆదివాసి సంఘ నాయకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు మన పిల్లల భవిష్యత్ కోసం మన హక్కులు చట్టాలు రక్షించుకోవడం గురించి ఆదివాసులుగా మన భాద్యత గా భారీ సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.