
పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ మందమర్రి మండల ప్రతినిధి (బొద్దుల భూమయ్య) జనవరి 21. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పల్లంగూడ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 37/ఆ,లో మూడు ఎకరాల భూమిలో గత 30 సంవత్సరాలుగా భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తుండగా తమ భూమిపై ఇతరులు రైతు భరోసా పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారికి రైతు భరోసా ఇవ్వకూడదని పల్లంగూడ గ్రామానికి చెందిన అల్లంల స్వామి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో దరఖాస్తు చేశారు. 2001 సంవత్సరంలో మా తండ్రిగారు అల్లంల మల్లయ్య సాదాభైనామాతో భూమి కొనుగోలు చేసినారని అప్పటినుండి అల్లంల మల్లయ్య పేరు మీద ఉండడంతో మేము కాస్తూలో ఉన్నామని 30 సంవత్సరాల తర్వాత ఇతరులు ఇగురపు లింగమ్మ ఆమె కుమారులు తమ భూమిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో. ఈ విషయంలో మేము కాసిపేట మండల తహసిల్దార్ గారిని సంప్రదించగా గిర్థవారి గారిని విచారణ నిమిత్తం పంపించారు. వారు విచారణ చేసి మోకా పై మేమే ఉన్నట్లు నిర్ధారణ చేశారు. మోకాపై మేమే ఉన్నట్లు స్పష్టత వచ్చినప్పటికి వారు మాపై తిరుగుబాటు చేశారు.ఈ విషయంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగినది. అని అల్లంల స్వామి తెలిపారు. ఇగురపు లింగమ్మ మరియు వారి కుమారులు రెవెన్యూ అధికారులను తప్పు త్రోవ పట్టించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి రైతు భరోసా తీసుకునేందుకు, పొందెందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మేము గత 30 సంవత్సరాలుగా కాస్తూ లో ఉండగా ఇగురపు లింగమ్మ వారి కుమారులకు రైతు భరోసా ఇవ్వకూడదని అల్లంల స్వామి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.