
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని నారాయణస్వామి కాలనీలో సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ అధ్యక్షతన రైతుల కోరికల దినోత్సవం సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు ఓబిరెడ్డి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట రాముడు యాదవ్ , సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పాలకులు అధికారంలోకి రాకముందు రైతే రాజు రైతు లేనిదే రాజ్యము లేదు అనిగోప్ప,గోప్పమాటలు చెప్పడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన అ మాటలుఅన్ని నీటి మూటలుగా మారుతున్నాయి అందువలన రైతులు ప్రతియెటా అప్పుల ఊపులో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు మల్లుతున్నారు ప్రతి సంవత్సరం సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతున్నది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యల పైన పూర్తిగా దృష్టి పెట్టి రైతన్న డిమాండ్లను తక్షణమే అమలు చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధ్యుత్ చట్టం 2022ను ఉపసంహరించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ మోటార్లకు, స్మార్ట్ మీటర్లు బిగించే పక్రియను రద్దు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ లు ప్రతి రైతుకు 20 వేల రూపాయలు సాగు సాయం వెంటనే అందించాలని, పంటలు నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అందించాలని, నకిలీ విత్తనాలు, ఎరువులు, అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టేలా చట్టాలు రూపొందించాలని ఏపీ రైతు సంఘం ద్వారా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు నీలూరు లక్ష్మయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డె రాముడు, చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ, సిపిఐ పట్టణ కార్యదర్శి కుల్లాయి రెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి ఆదినారాయణ యాదవ్, సిపిఐ నాయకులు నబి రసూల్, గరిడీ శివన్న రామ సుబ్బారెడ్డి, సురేష్ వెంకట రమణయ్య, మాబు పీరా, రమేష్ పాల్గొన్నారు.