
భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం అందిస్తాం..
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వందశాతం అండగా ఉంటుంది ..
భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం అందిస్తాం..
భూసేకరణకు రైతులు సహకరించాలి…
పయనించే సూర్యుడు //న్యూస్//ఫిబ్రవరి 20// మక్తల్ – పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న భూసేకరణ సర్వే కు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని మక్తల్ నియోజవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా, మండల అధ్యక్షులు గణేష్ కుమార్, సీనియర్ నాయకులు చంద్రకాంత్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్, సూచించారు. ఎమ్మెల్యే నివాసంలో చేపట్టిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… నారాయణ పేట్ జిల్లా వాసుల దశాబ్దాల కళ అయిన 69 జీవోను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే మక్తల్ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తూ.. ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. మక్తల్ ప్రాంతం నుంచే నీటిని ఎత్తిపోసి మక్తల్ పరిధిలోని జక్లేర్, గుడిగండ్ల, ఉట్కూరు మండలం తో పాటు నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు ఈ పథకాన్ని రూపొందించారని అన్నారు. అయితే రాజకీయ విపక్షాలు దురుద్దేశంతో రైతులను రెచ్చగొట్టి భూసేకరణ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి ఉచ్చులో రైతులు పడవద్దని సూచించారు. ప్రస్తుతం సర్వే జరుగుతుందని, ఈ సర్వే జరిగితేనే ఎవరి పొలాలు కోల్పోతాయో తెలుస్తుందని, ఈ సర్వే ని అడ్డుకోవద్దని సూచించారు. భూములు కొల్పోయే రైతులకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులకు నష్టపరిహారం అందించేందుకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి . ప్రభుత్వంతో కొట్లాడి నిధులు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే మక్తల్ పేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పంచలింగాల నగేష్, గద్వాల రవికుమార్, బోయ నరసింహ, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.ఏ. రవికుమార్ అధ్యక్షులు.మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ