ఇండస్ట్రీ దుమ్ము, ధూళి వల్ల పంట నష్టపోతున్న రైతులు
లబోదిబోమంటున్న పత్తి, కంది రైతులు
పయనించే సూర్యుడు జనవరి 10 మంథని నియోజకవర్గం మంథని మండలం దంతలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన
కొంజర్ల ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ బ్రిక్స్ ఇండస్ట్రీ వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని దంతలపల్లె రైతులు లబోదిబో మంటున్నారు. దంతలపల్లి ఊరును పంట పొలాలను అనుకొని ఉన్న బ్రిక్స్ ఇండస్ట్రీ దుమ్ము వల్ల పత్తి, కంది పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. పండించిన పత్తి పంట దుమ్ము వల్ల రంగు మారి అమ్ముకోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి ఏటా ఇదే పరిస్థితిని ఎదుర్కొని గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకు పోతున్నామని కన్నీళ్ళ పర్యంతం అవుతున్నారు. బ్రిక్స్ ఇండస్ట్రీ యజమానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పెడచెవిన పెడుతున్నారని అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు బ్రిక్స్ ఇండస్ట్రీ వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.