Wednesday, February 26, 2025
Homeఆంధ్రప్రదేశ్లడ్డు ప్రసాదాలను తినిబండారాలను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు…

లడ్డు ప్రసాదాలను తినిబండారాలను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు…

Listen to this article

పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 26: రిపోర్టర్ (కే శివ కృష్ణ) లడ్డు ప్రసాదం, తినుబండారాల దుకాణాలు తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిదేవరాజ్ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల కోటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈనెల 26న జరుగు మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హోటల్లోని తినుబండారాల దుకాణాలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి,కే.దేవరాజ్ మంగళవారం తనిఖీ చేశారు.ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న లడ్డు ప్రసాదం, పులిహారలను తనిఖీ చేసి తయారు చేసే విధానాన్ని పరిశీలించి తగు సూచనలు సలహాలిచ్చారు. తిరుణాలలో ఏర్పాటుచేసిన స్వీట్ షాప్ లను పరిశీలించి స్వీట్ల లో కలర్స్ వేయరాదని పదేపదే వాడిన ఆయిల్ మరల వాడకూడదని, నాణ్యమైన,రుచికరమైన పదార్థాలు తయారుచేసి భక్తులకు అందించాలన్నారు. తినుబండారాలపై దుమ్ము,దూళి పడకుండా ప్రజల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ,అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments