
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి )
మండల పరిధిలోని యాడికి, రాయల చెరువు, మసీదుల నుండి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు బిల్లును ఏకపక్షంగా ఆమోదించడానికి నిరసనగా మండలంలోని ముస్లిం సోదరులు బస్టాండ్ కూడలిలోని మానవహరంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు అనంతరం పురవీధుల గుండా బైకు ర్యాలీ నిర్వహించి తాడిపత్రి పట్టణంలోని సిద్ధి భాష దర్గా వద్ద ముస్లిం సోదరులు చేపట్టిన దీక్షలకు మద్దతుగా మండలంలోని పలు మసీదుల నుండి మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణంలోని రిలే దీక్షకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు అనంతరం చాంద్ భాషా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ను ఏకపక్షంగా ఆమోదించడాన్ని ముస్లిమ్ సోదరులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రంలోని బి.జె.పి ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు వక్ఫ్ బోర్డ్ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ దొడ్డి దారిన పార్లమెంటులో ఆమోదించడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది అని కేంద్రంలోని పెద్దలు చెప్పుచున్నారు కానీ 24 గంటలు ఒక వర్గం మీద దాడి చేస్తున్నారు. అటువంటిది ఆ వర్గానికి మంచి చేస్తామంటే హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. అనంతరం జూటూరు రబ్బాని మాట్లాడుతూ కొంతమంది సోషల్ మీడియాలో దేశంలో ఏ స్థలాన్ని అయినా వక్ఫ్ బోర్డు కబ్జా చేసే అధికారాన్ని వక్ఫ్ కు గత ప్రభుత్వం ఇచ్చింది అని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అటువంటిది ఏమీ లేదు అంతా అబద్ధం వక్ఫ్ బోర్డు స్థలాలు ప్రభుత్వం ద్వారా సర్వే చేయబడి నిజంగా వక్ఫ్ భూమి అవునొ కాదో నిర్ధారణ చేసుకున్నాకే ప్రభుత్వం వక్ఫ్ బోర్డు స్థలాలకు ఆమోదంఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు మసీదుల మత గురువులు, మరియు సలీం భాషా, స్టార్ ఎలక్ట్రికల్ షరీఫ్, సులేమాన్, సెల్ పాయింట్ చాంద్ భాషా, హాజీ మస్తాన్, ఫిరోజ్ భాష, అచ్చుకట్ల భాష, హాజీ వలి, కోటవీధి షేక్ష, జాఫర్, పఠాన్ ఫారూఖ్, మొహమ్మద్, మిడుతురు షాను, చికెన్ వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
