
గుంతల మయంగా మారిన … చేన్నారెడ్డి గూడ –చెగిరెడ్డి ఘనపూర్ రహదారి
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ డిమాండ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం చౌదర్ గూడా మండలం చేన్నారెడ్డి గూడ నుంచి చెగిరెడ్డి ఘనపూర్ వెళ్లే ప్రధాన రహదారి, మరొకచోట జాకారం నుంచి గుంజలపాడు, ఎల్కగూడెం, నుంచి పద్మారం, లల్పాడు నుంచి తుమ్మలపల్లి, కొందుర్గ్ మండల వేనికిర్యాల రహదారి కూడా వర్ష ప్రభావానికి తీవ్రంగా దెబ్బతింది. గడిచిన పది రోజులుగా ఈ రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బస్సులు ఆగిపోవడంతో విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ మాట్లాడుతూ… విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు గుంతల కారణంగా బస్సులు నిలిపి వేయబడ్డాయని స్పష్టం చేస్తున్నారు . వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరారు.ఇక బస్ డ్రైవర్లు, కండక్టర్లు మాట్లాడుతూ… రోడ్డుపై తీవ్రస్థాయిలో గుంతలు ఏర్పడటంతో వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారింది. అందుకే అధికారులు రాకపోకలు నిలిపివేయమని ఆదేశించారు. రోడ్డు సరిగా మరమ్మతులు చేస్తే మళ్లీ బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు.
