
పి డి యస్ యూ, పి వై ఎల్ డిమాండ్
పయనించే సూర్యుడు మార్చి 20 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం సంపత్ నగర్ వసతి గృహంలో మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుండి తొలగించాలి పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి వై ఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ డిమాండ్ చేశారు. గురువారం పి డి యస్ యూ సంఘాల నాయకులు బాదిత విద్యార్థిని గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడారు. టేకులపల్లి మండలం గంగారం గ్రామం ఆశ్రమ పాఠశాలలో గత రెండు రోజుల క్రితం మంగళవారం ఒక ఉపాధ్యాయుడు మద్యం సేవించి ఒక విద్యార్థిని పట్ల లైంగికంగా వేధింపులకు గురి చేశాడనే కారణంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు,గ్రామస్తులు కలిసి దేహ శుద్ధి చేసిన సంఘటన అందరికీ విధితమే. ఈ విషయం పై పి డి యస్ యూ, పి వై ఎల్ ప్రగతిశీల విద్యార్థి యువజన సంఘాల నేతృత్వంలో జరిగిన విషయాలను చర్చించి వాస్తవ విషయాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తుల నుండి వెలుగులోకి వచ్చిన విషయాలు అనేకం ఉన్నాయి. విద్యార్థినిని గత కొన్ని రోజుల నుండే వేధింపులకు గురి చేస్తున్నాడనే విషయం విద్యార్థినీ కుటుంబ సభ్యులతో చెప్పుకోలేక పోయిందని కీచక ఉపాధ్యాయుడి ప్రవర్తన స్వయంగా కుటుంబ సభ్యులే చూడడంతో దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. వార్డెన్ గా తండ్రి పాత్ర పోషించాల్సిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వల్ల గిరిజన ఆశ్రమాలలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని, గిరిజన ఆశ్రమాలపై తల్లిదండ్రులకు నమ్మకాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గిరిజన శాఖ అధికారులు ఆశ్రమాలలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ డివిజన్ కార్యదర్శి బానోత్ నరేందర్, పి వై ఎల్ డివిజన్ నాయకులు ఊకె శ్రావణ్, గ్రామస్తులు రాచకొండ గోపి,జోగ సమ్మయ్య దొర యాస నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.