ఎన్టీఆర్ జిల్లా: ద్విచక్ర వాహన చోదకులకు హెల్మెట్ తప్పనిసరి-సీఐ కె. గిరి బాబు.
పయనించే సూర్యుడు జనవరి 22 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా వార్తా విశ్లేషణ.
విజయవాడ సీపీ ఆదేశాల మేరకు తిరువూరులో “హెల్మెట్ అవగాహన కార్యక్రమం..
శిరస్త్రాణం ఉంటేనే వాహన దారులు సురక్షితం..
ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..
ప్రమాదాల నియంత్రణకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు..
హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా ఈ నిబంధన పాటించాలన్నారు.
లేనిపక్షంలో ఎంవీఐ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం,సెల్ ఫోన్ డ్రైవ్, పరిమితికి మించి ప్రయాణికులు వాహనాల్లో వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు.
అటువంటి వాటిని నియంత్రించగలిగితే రోడ్డు ప్రమాదాలు జరగవని సీఐ పేర్కొన్నారు..
నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వాహనీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో జిల్లాస్థాయి ట్రాఫిక్ వాలంటీర్ కార్యక్రమం చేపట్టారు.
ఎస్ఐ కేవిజివి సత్యనారాయణ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు..