
పేద విద్యార్థుల భవిష్యత్ పునాది ఈ కళాశాల
నేటి విద్యార్థులు రేపటి భావి భారత పౌరులు
షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్
దాతల సహకారంతో నిర్మిస్తున్న కళాశాలకు స్లాబ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
పయనించే సూర్యుడు మార్చ్ 3 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ : విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లో కళాశాల ప్రాంగణంలోనే నిర్ణయించబడుతుందని అక్కడినుండే దేశ భావి భారత పౌరులుగా విద్యార్థులు తయారవుతారని షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం దాతల సహకారంతో నిర్మిస్తున్న కళాశాల నిర్మాణానికి పట్టువదలని విక్రమార్కుడిలా కంకణ బద్ధుడై పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నారు సోమవారం నాడు కళాశాల నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ నిర్మాణ పనులను తాపితో ప్రారంభించారు రాజకీయ పార్టీలకు అతీతంగా ఎలాంటి భేషజాలు లేకుండా అందరి సహాయ సహకారాలతో నిర్మించాలని ప్రతి పేద విద్యార్థినీ విద్యార్థులకు విద్య అవసరమని ఆ విద్యతోనే వారు ఎక్కడికైనా వెళ్లి బ్రతకగలుగుతారని ఒక కుటుంబంలో ఒక విద్యార్థిని విద్యార్థి చదువుకుంటే చదువుతో పేదరికన్ని నిర్మూలించ వచ్చని అన్నారు ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ కళాశాల నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి కొంకల చెన్నయ్య చల్లా శ్రీకాంత్ రెడ్డి రఘు విశ్వం దంగు శ్రీనివాస్ యాదవ్ మాధవులు దిలీప్ లింగారెడ్డి గూడా అశోక్ తదితరులు పాల్గొన్నారు.