
పయనించే సూర్యుడు జూలై 22 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం పెరుమళ్ళపాడు ప్రాథమిక పాఠశాలలో ఉమెన్స్ అవేర్‌నెస్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వేమారెడ్డి బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విపులంగా వివరించారు. మహిళల భద్రత, అవగాహన, హక్కులపై కూడా విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల్లో జాగ్రత్తలు, ఆత్మరక్షణపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడిందని ఉపాధ్యాయులు తెలిపారు.