
ఫోటో : విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన గేదె…
రుద్రూర్, ఏప్రిల్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలంలోని రాణంపల్లి శివారులో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృతి చెందింది. రాణంపల్లి గ్రామానికి చెందిన బోయి శ్రీనివాస్ గేదెలపై జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మేత కోసం గేదెలను తీసుకువెళ్లగా రాణంపల్లి శివారులోని పొలంలో మేత మేస్తున్న గేదె ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ కు గురై ఘటన స్థలంలో మృతి చెందిదని, ఈ గేదె గర్భం దాల్చి ఉందని రైతు బోరున విలపించాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచే ఏర్పాటు చేయకపోవడంతోనే తన పాడి గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందడం జరిగిందని రైతు ఆరోపించారు. సుమారు లక్ష 25 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.