
పయనించే సూర్యుడు, జనవరి 29, పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.
పలాస 132 కేవి సబ్ స్టేషన్ లో విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్న కారణం గా జనవరి 31, శుక్రవారం ఉదయం 09:00 నుండి మధ్యహ్నం 02:00 వరకు పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలలో గల గ్రామాలలో విద్యుత్ నిలుపుదల చేయబడునని పలాస డివిజన్ విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి యజ్ఞేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు . విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని వినియోగదారులకు ముందుగా సమాచారాన్ని అందిస్తున్నామని, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.