
పయనించే సూర్యుడు న్యూస్ ఫిబ్రవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ ; తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో జోహార్ కర్నాటి యాదగిరి అన్నకు సీపీఐ ఎంఎల్ మస్ లైన్ రాష్ట్ర నాయకులు ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈనెల 17వ తేదీ రోజున నిజామాబాద్ నగరంలో జరిగే సంతాప సభను విజయవంతం చేయాలని ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మస్ లైన్ డివిజన్ కార్యదర్శి డివిజన్ కార్యదర్శి బి దేవారం .సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యాజించి జీవితాంతం 50 సంవత్సరాలు పైగా విప్లవోద్యమ జీవితంగా ఆదర్శవంతంగా బ్రతికిన కామ్రేడ్ కర్నాటి యాదగిరి అన్న ఇదే నెల ఒకటి తేదీన మరణించారు ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూన్నారు. వారి జీవిత సహాచారిని కామ్రేడ్ అనసూయక్క క్యాన్సర్ వ్యాధితో ఇటీవల మరణించారు. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచి త్యాగాల బాటలో నడిచిన కామ్రేడ్ యాదగిరి అన్న ఆదర్శం కమ్యూనిస్టు బాటలో మనమందరం నడవాలని ఈ నల 17 వ తేదీన రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే వారి సంతాప సభను మేధావులు విద్యార్థులు సానుభూతిపరులు అందరు హాజరై విప్లవ జోహార్లు అర్పించాలని వారు తెలియ జేసరు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు మచ్చర్ల రాజన్న పద్మ అనిల్ కుమార్ నాయకులు మమత నిఖిల్ సిద్ధార్థ నజీర్ తూర్పాటి శ్రీనివాస్ అరవింద్ బట్టు రవి తదితరులు పాల్గొన్నారు