
పయనించే సూర్యుడు గాంధారి: 15/05/25
శివనామ స్మరణతో మానసిక ప్రశాంతత వుంటుందదని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఈ సందర్భగా మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నారాయణ గిరి వద్ద వైభవంగా శివ భక్త మార్కండేయ ప్రతిష్టాపన ఉత్సవాలు మూడవ రోజు బుధవారం వైభవంగా మాధవ నంద సరస్వతి పీఠాధిపతి(రంగంపేట) చేతుల మీదుగా నిర్వహించారు. ఆలయంలో అనంతరం శివ పంచయతన్ సహిత మార్కండేయ విగ్రహా ధ్వజ, శిఖర ప్రతిష్ట త్రయానిక యాగ మహత్సవలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. పురోహితులు సంతోష్ వేద పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం, భజన కార్యక్రమాలు చేపట్టారు. సంఘ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు