
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆశీస్సులతో పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా గోరంట్ల మండలం పులేరు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బోయ శ్రీనివాసులు ఎంపికయ్యారు, ఈ సందర్భంగా గోరంట్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజక వర్గం బీసీ సెల్ అధ్యక్షుడు, ఉప సర్పంచ్ శ్రీనివాసులు కు జీనవాండ్ల పల్లి లోని ఆయన స్వగృహంలో పూల మాలలు,సాలవాలతో సత్కరించారు,అలాగే భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాక్షించారు, ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేష్, పట్టణ కన్వీనర్ మేదర శంకర్, సర్పంచ్ ఆంజనేయులు, వైస్ ఎంపీపీ భర్త సత్య నారాయణ, ఎంపీటీసీ సోమశేఖర్, వార్డు సభ్యులు భాను ప్రకాష్, పులేరు సురేష్ రెడ్డి, ప్రతాప్ సింగ్,సాయి కృష్ణ,శంకర్, మాజీ డీలర్ వెంకటేష్ తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.