
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13.09.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ o చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు వ్యవసాయ డిప్లమా కోర్సు కు ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు చేసుకో ని టెన్త్ పాసైన లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం మదన్మోహన్ తెలిపారు ఈనెల 15న కృష్ణా ఆడిటోరియం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం గుంటూరు నందు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించబడునున్నారు ఆసక్తిగల విద్యార్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు అయ్యి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పుంగనూరు నందు అడ్మిషన్ పొందవచ్చునని ఆయన వివరించారు ఈ కోర్సు కాలవ్యవధి రెండు సంవత్సరాలని ఈ కోర్సులో పదవ తరగతిలో వచ్చిన మార్పుల ఆధారంగా సీటు కేటాయించడం జరుగుతుందన్నారు డిప్లమా కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు బిఎస్సి అగ్రికల్చర్ తో పాటు ఇతర డిగ్రీ కోర్సులలో ప్రవేశం ఉపాధి అవకాశాలు ఉన్నందున విద్యార్థులు వారి తండ్రులు గుర్తించి ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు మరిన్ని వివరాలకు 9381351156 9010402068 నంబర్లకు సంప్రదించాలన్నారు