
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 28 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులు విద్యతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో రాణించాలని రాజధాని పాఠశాల చైర్మన్ కరస్పాండెంట్ యాద నరేంద్ర గుప్తా సూచించారు శుక్రవారం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకొని జగద్గిరిగుట్ట పరిధి పాపిరెడ్డి నగర్ లో గల రాజధాని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివే విద్యార్థులకు చదువుతోపాటు వారి మనోభావాలకు అనుగుణంగా వారిలోని నైపుణ్యతను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామన్నారు వారి విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా దేశ ప్రతిష్టను పెంచే విధంగా తయారు చేస్తున్నామన్నారు. సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ముడు వందల కు పైగా నమూనా లను తయారు చేశారు కాలుష్యం రవాణా నీటిపారుదల వ్యవసాయం వైద్యం పట్టానాభివృద్ధి అంశాలపై తయారుచేసిన నమూనాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు యాద రేణుకా యాద కార్తీక్ గుప్తా అనిత శిరీష రాజ్యలక్ష్మి కవిత తోపాటు పాపిరెడ్డి నగర్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు