
పయనించే సూర్యుడు మే 24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
టి.సుండుపల్లి,వీరబల్లి మండలాల మధ్యన అలానే సానిపాయి మరియు చిన్నగొల్లపల్లి గ్రామపంచాయతీల సరిహద్దుల్లో రాయచోటి,రాజంపేట,టి. సుండుపల్లి మధ్య వెళ్ళే సర్కిల్ నందు రోడ్డుపై మర్రిచెట్టు వద్ద వెలసిన శ్రీ ఆంజనేయస్వామి గుడిలో రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ స్వామి వారి ఆశీస్సులు భక్తాదులతో పాటుగా ప్రతిఒక్కరికి అందాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా “సర్పంచ్ రామ జయచంద్ర’ ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ నిర్వహణలో భక్తాదులకు బోజనాలను వడ్డించారు.అదేవిధంగా శివకుమార్ రమేష్ నాగేష్ తదితర యూత్ తరపున లస్సీ మరియు మజ్జిగ ప్యాకెట్లు స్వామి వారి భక్తులకు, ప్రజలకు పంపిణీ చేశారు.అలానే స్వామి వారి తిరుణాల పురస్కరించుకుని రాత్రికి విద్యుత్ దీపాలంకరణలతో చాందని బండ్లు చెక్కభజనలు కోలాటాలు డిజెలు డప్పులు వాయిద్యాలు బాణసంచాలు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు కార్యనిర్వాహకులు స్థానికులు గ్రామస్థులు గ్రామపెద్దలు ప్రజాప్రతినిధులు జనసైనికులు కూటమి శ్రేణులు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు చుట్టుపక్కల గ్రామాల వారు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేశారు.