
పయనించే సూర్యుడు న్యూస్ మే 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
హనుమాన్ జయంతి మరియు సాయిబాబా మందిర ద్వాదశ వార్షికోత్సవ సందర్భంగా కూకట్ పల్లి బాగ్ అమీర్ శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం లో గురువారం ఉదయం సాయిబాబా ఆలయం ద్వాదశ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు శ్రీ బాలాంజనేయ స్వామి వారికి అభిషేకం, లక్ష తమలపాకుల పూజ, మరియు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, సాయంత్రం ఆరు గంటల నుండి స్వామి వారి వాహనమైన ఒంటెపై ఊరేగింపు కార్యక్రమాలను ఆలయ కమిటి అధ్యక్షులు ఆకుల లక్ష్మణరావు, ఆలయ ప్రధాన అర్చకులు రమణ పంతులు మరియు వారి బృందం, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో కూకట్ పల్లి, శేర్లింగంపల్లి నియోజకవర్గం డివిజన్ లోని పలు ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు భక్తులు, పెద్దలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆలయం లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మరియు శ్రీ బాలాంజనేయ స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులైనారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
