
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 7 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల పరిధిలోని బోయరెడ్డిపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాతి దూలం పోటీలు నిర్వహించడం జరిగినది. పోటీలను యాడికి సిఐ వీరన్న ప్రారంభించడం జరిగినది. అనంతరం గెలుపొందిన వృషభ రాజుల యజమానులకు బహుమతులు అందజేయడం జరిగినది మొదటి బహుమతి పెద్ద పేట చిన్నారెడ్డి కి చెందిన 14000 వృషభ రాజులు గెలుపొందడం జరిగినది రెండవ బహుమతి ఈరన్నపల్లి వెంకటరాముడు 9000, మూడవ బహుమతి కొత్తపల్లి విజయభాస్కర్ 6000, నాలుగో బహుమతి తాడిపత్రి నాగార్జున 4000, ఐదవ బహుమతి తాడిపత్రి లడ్డు 3000 రూపాయలు వృషభ రాజులు గెలుపొందడం జరిగినది. గెలుపొందిన వారికి సీఐ ఈరన్న చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పడమల శివ గంగరాజు, నాగేష్ బోయరెడ్డిపల్లి హరీ, లక్ష్మీనారాయణ, రామచంద్ర, వెంకటరామిరెడ్డి, మరియు బోయరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగినది
