
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మిషన్ భగీరథ, మున్సిపల్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
( పయనించే సూర్యుడు ఆగస్టు 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలకు ఆయా ప్రాంతాలకు మిషన్ భగీరథ నీరు అందే విధంగా చొరవ చూపాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ సూచించారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సునీత రెడ్డి సమక్షంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి మున్సిపల్ సిబ్బంది మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అనేక కాలనీలలో తను పర్యటించిన సందర్భంగా మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పట్ల కొన్ని సమస్యలు తన దృష్టికి తెచ్చారని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యలు చిన్నవిగా ఉన్నప్పుడే వాటిని గుర్తించి పరిష్కరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని ఆయన సూచించారు. ఆయా కాలనీలకు మంచినీటి సరఫరా అందించే విషయంలో అధికారులు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని పరిగి రోడ్డులో డివైడర్ ఏర్పాటు వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని అదే విధంగా విద్యుత్ కాంతులకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు విస్తరణ ప్రకారం నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్డును ముస్తాబు చేయాలని అధికారులను సూచించారు..
