
టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ నేతృత్వంలో ఘన నివాళి
( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
నిజాంపై అక్షర పోరాటం చేసి తన రెండు చేతులను పోగొట్టుకున్న మహనీయుడు, ఆదర్శాల కోసం విలువైన ప్రాణాలను అర్పించి జర్నలిస్టులకు ఆదర్శ ప్రాయుడైన షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంకుబండు మీద ఏర్పాటు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) డిమాండ్ చేశారు. షాద్ నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థలాన్ని కేటాయిస్తే తన సొంత ఖర్చుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నిజాం పోరాట యోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ 77వ వర్ధంతిని పురస్కరించుకొని షాద్ నగర్ పట్టణ కూడలిపై షాద్ నగర్ టిడబ్ల్యూజేఎఫ్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ ఆధ్వర్యంలోస్థానిక జర్నలిస్టులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్షర పోరాటం చేసిన షోయబుల్లాఖాన్ జర్నలిస్టులకు ఆదర్శమని ప్రశంసించారు. అలాంటి మహనీయుడికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ చరిత్రలో గుర్తుంచుకోవలసిన జర్నలిస్టులు కొందరే ఉన్నారని అలాంటి వారిలో షోయబుల్లాఖాన్ ముందువరుసలో ఉంటారని ప్రశంసించారు. ఆయన ఆదర్శంగా ప్రతి జర్నలిస్టు నిజాయితీగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వం నుంచి ప్రజలను కాపాడేందుకు తన రెండు చేతులను పోగొట్టుకున్న షోయబుల్లాఖాన్ ను చరిత్ర ఇప్పటికీ మర్చిపోతున్నారనీ జర్నలిస్టులు లక్కాకుల రమేష్ కుమార్, కస్తూరి రంగనాథ్, నరసింహారెడ్డి, అప్సర్, సురేష్, రాకేష్, సాయినాథ్ రెడ్డి, కృష్ణ, జగన్, మహేష్, బాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
