
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:షాప్ గుమస్తాలు, పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్, మిల్లు వర్కర్స్, ప్రైవేటు స్కూలు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రైవేట్ ఆసుపత్రి, లాబ్ వర్కర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, హోటల్, బేకరి మాస్టర్లు, హెల్పర్లు,,వర్కర్లు,ఇటుక బట్టి,కాంట్రాక్టు కార్మికులు,బిల్డింగ్,సమస్త షెడ్యూల్ కార్మికుల వేతనాలు పెంచాలని,ఇన్స్యూరెన్స్, పీ ఎఫ్, ఈ ఎస్ ఐ,తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో స్థానిక లేబర్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి అదికారికి వినతి పత్రాన్ని సమర్పించారు.అనంతరం జరిగిన సభలో సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ లు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా కార్మికుల తల రాతలు మారడం లేదని రోజూ రోజూ కు ధరలు ఆకాశాన్నంటుతుంటే వేతనాలు పెంచక పోగా ప్రభుత్వ కొత్త జీ ఓ వల్ల తగ్గుతున్నాయి అని అన్నారు. పైన తెలిపిన షెడ్యూలు కార్మికుల వేతన సవరణ చేసి ఉన్న స్థితీ నుండి ఉన్నత స్థాయిలో చేర్చే విధంగా ప్రభుత్వ నుండి సహకారం సంపూర్ణంగా కార్మిక వర్గానికి అందించాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో బోయిన శేఖర్, కామ నాగరాజు మహమూద్,శివకృష్ణ, రాజు, భాస్కర్,సతీష్, పవన్,సత్యనారాయణ కోరి, సురేష్, నరేశ్,ఆదిత్య,సాయిలు, డానియల్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.