
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ డివిజన్ ఇంచార్జి మే 19
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు 5 వ, రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.ఈ రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తృష్టి జోగారావు మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసి ఉపాధ్యాయ పోస్టులు మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3 చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివాసి జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఆదివాసి అడ్వకేట్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఆత్రం నవీన్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించుకోవచ్చు అన్నారు.కానీ నేటికీ షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేసే ఎమ్మెల్యేలు అందరిని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చెయ్యకపోవడం చాలా దురదృష్టకరమన్నారు.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ తక్షణమే ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.ఆదివాసి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. మరియు ఈరోజు గ్రీవెన్స్ లో ఆదివాసీ నాయకులు PO గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపనలు పంపించమని మెమొరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో పెద గెడ్డాడ సర్పంచ్ వడగల ప్రసాద్ బాబు,పోడియం పండు దొర,చవలం శుభకృష్ణ దొర,పండా పవన్ కుమార్ దొర,మడకం వరప్రసాద్ దొర,కడబాల రాంబాబు రెడ్డి,కారం రంగారావు దొర,ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,కారం రామన్న దొర,కారం చిన్నికృష్ణ,పండా భద్రం దొర,చిలకల సత్యనారాయణ కొండకాపు సంఘం అధ్యక్షులు,కారుకోడి గాంధీబాబు,బోరగ పొట్టి దొర, కుంజం అగ్గిదొర, కుంజం వెంకన్నదొర, తుర్రం వీరబాబు,కారం రామన్నదొర,బోరగ గంగరాజు తదితరులు పాల్గొన్నారన్నారు.
