పయనించే సూర్యుడు న్యూస్( జనవరి.25/01/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్… తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని కోటమిట్ట ప్రాంతం నందు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎస్. శరవనన్ ఆధ్వర్యంలో నోటి పుస్తకములు, పెన్ను ,పలకలు, పెన్సిల్,రబ్బర్, స్కేల్, వాటర్ బాటిల్ ను స్థానిక ఎస్సై రామస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రామస్వామి, ఎంఈఓ రవి ముఖ్య అతిథులుగా హాజరుకాగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ఈ సమస్త వారి ఉదారత్వం హర్షనీయం అన్నారు. విద్యార్థులు భావి చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఎంఈఓ రవి మాట్లాడుతూ సమస్త అధినేత శరవణన్ ఇలాంటి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్మించడం గర్వించదగ్గ విషయం అన్నారు. రాబోయే రోజుల్లో బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 ఉష, పాఠశాల ఉపాధ్యాయులు గీత, గురునాథం, విరమణ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, బిలీవ్ ఎఫెక్టివ్ సర్వీస్ ట్రస్ట్ ట్రెజరర్ కృష్ణవేణి, సభ్యులు కార్తీక్, శశికళ, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యవేడు ఎస్ఐ రామస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
RELATED ARTICLES