
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.1/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణం కుమ్మరగుంట కాలనీ పాపానాయుడు వీధిలో నివాసమున్న వృద్ధురాలు మెడలో నుంచి పట్టపగలే ఓ దుండగుడు బంగారు చైను లాకెళ్లిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.వివరాలు ఇలా పాపానాయుడు వీధిలో నాగమ్మ నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బజారుకు వెళ్లి నిత్యవసర వస్తువులు కొనుక్కొని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది.ఇదే సమయంలో వృద్ధురాలు నాగమ్మ మెడలో బంగారు చైన్‌పై దుండగుడు కన్ను పడింది.ఈ క్రమంలో మరి కాసేపట్లో ఇల్లు చేరనుండగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు నాగమ్మ మెడలోని బంగారు చైనును పాపా నాయుడు వీధిలో దుండగుడు లాక్కొని పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకుడు మురళి( చికెన్ చిన్న) కుమారుడు జగన్ దీన్ని గమనించి ద్విచక్ర వాహనం ద్వారా దుండగుడు వెంట పడ్డారు.చెన్నై మార్గంలో చాముండేశ్వరి థియేటర్ సమీపంలో రెడ్ హ్యాండెడ్‌గా దుండగుడునీ పట్టుకున్నారు.తదనంతరం టిడిపి నాయకుడు మురళి,జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ సమక్షంలో బంగారు చైన్‌తో సహా దొంగను స్థానిక ఎస్సై రామస్వామికి అప్పగించారు అయితే దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు చైన్‌ను వెంటనే బాధితురాలు నాగమ్మకు పోలీసుల అప్పగించారు.బంగారు చైను లాక్కెళ్ళిన దుండగుడు తమిళనాడు చెదురుపాకం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.