
దళిత బహుజన మహనీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
అంజిరెడ్డి చరిత్ర హీనుడు…..
మహనీయులపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
దళిత,బహుజన ప్రజా సంఘాలు & రాజకీయ పార్టీలు
//పయనించే సూర్యుడు// న్యూస్ సెప్టెంబర్20// మక్తల్
స్కాలర్స్ జూనియర్ కాలేజ్ మరియు రేడియంట్ హై స్కూల్ యజమాని అయిన అగ్రకుల అహంకారి అంజిరెడ్డి* మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ టు మున్సిపల్ మధ్యగల చౌరస్తాకు పెరియార్ పేరును పెట్టగా… అట్టి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ… తన కుటీల బుద్ధితో దళిత బహుజన నాయకుడు భారతదేశ ఆధునిక సోక్రటీస్ పెరియర్ రామస్వామి పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిని నిన్న మక్తల్ లోని అన్ని సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేశాడు. భారతదేశ ద్రావిడ ఉద్యమాన్ని,ఉద్యమ నాయకత్వాన్ని తీవ్రంగా అవమానించాడు.చరిత్ర చదవలేని, నేర్చుకోలేని అంజిరెడ్డి చరిత్ర గురించి మాట్లాడడం సిగ్గుచేటైన విషయం. పెరియార్ రామస్వామి కూతురిని పెళ్లి చేసుకున్నాడని కామ వాంఛతో చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపించే ధైర్యం ఉంటే ఆధారాలతో చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాము. నిరూపించలేని పక్షంలో బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా అనేక సందర్భాలలో మహనీయులపై,స్వతంత్ర సమరయోధులపై ఆనలోచిత వ్యాఖ్యలు చేయడం ఈయనకు సర్వసాధారణంగా మారిపోయింది.2024 ఆగస్టు 15న తన స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి అంజిరెడ్డి అనే అగ్రకుల అహంకారి మాట్లాడుతూ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టి, బీసీలకు రిజర్వేషన్లు పెట్టి చాలామందిని మోసం చేశాడని రిజర్వేషన్ల ఆవశ్యకత తెలియని మూర్ఖుడు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు… అలాగే గత 40 ఏళ్ల క్రితం మక్తల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అంబేద్కర్ చౌరస్తాగా ప్రజలు పిలుచుకోవడం జరుగుతూ వస్తుంది. ఈ చౌరస్తాను కనుమరుగు చేయడం కోసం వివేకనంద చౌరస్తా పేరుతో ఈయన ముందుకు వచ్చాడు… మేము లేదా మా సమాజం ఎలాంటి అభ్యంతరం తెలపకుండా స్వాగతించాము… అది మా చైతన్యం.మాకు స్ఫూర్తిదాయకమైనవు మహానీయుల నుండి నుండి నేర్చుకున్న గొప్పతనం… ఈయనకు నిజంగా మహనీయుడు అంబేద్కర్ పై మంచి అభిప్రాయమే ఉంటే పక్క పక్కనే ఇద్దరు మహనీయులను ఉంచి పైశాచిక ఆనందం పొందే వారు కాదు.మక్తల్ లో మేము 2016 లోనే భారతదేశ విప్లవకారుడు భగత్ సింగ్ విగ్రహాన్ని శ్రీరాంనగర్ దగ్గర ఎంపీడీఓ ఆఫీస్ మూలపై లో పెట్టాలని పూనుకుంటే ఇదే హిందూ సంస్థ ప్రతినిధులు అక్కడ భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టొద్దని దాదాపు 20 మంది మా దగ్గరికి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు… దేశభక్తులు లేని చోట మహనీయుని విగ్రహం పెట్టడం వృధా అని విరమించుకున్నాము… ఇక్కడ దేశభక్తిని ప్రదర్శించింది మీరా?మేమ?ఆలోచించండి.2024లో భగత్ సింగ్ జయంతి సందర్భంగా మున్సిపల్ రోడ్డు, అంబేద్కర్ నగర్ దగ్గర ఉన్న చౌరస్తాకు భగత్ సింగ్ పేరును నామకరణం చేసింది మేమే. అక్కడే భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ, విగ్రహ ఏర్పాటుకు స్థలం సరిపోని కారణంగా నారాయణపేట రోడ్డులో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహం ఉన్నచోటే భగత్ సింగ్ చౌరస్తా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం లో నుండి విగ్రహం ఒక దగ్గర చౌరస్తా ఒక దగ్గర పెట్టడం సరికాదని ప్రజాసంఘాలుగా అభిప్రాయపడి భారతదేశ ఆధునిక సోక్రటీస్ అయినా పెరియర్ రామస్వామి చౌరస్తాగా నామకరణం చేయడం జరిగింది.దేశభక్తికి దైవభక్తికి పొంతనలేని వ్యవహారాన్ని మేమేదో నిజమైన దేశభక్తులమని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా అనేక సందర్భాలలో ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి వైశ్యామ్యాలు పెంచే ప్రయత్నానికి మక్తల్ లో కొంతమంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.కావున సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో కామ వాంఛతో ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించి ఘర్షణలకు దారి తీసే విధంగా వ్యవహరించిన అంజిరెడ్డి తో పాటు ఆ స్టేట్మెంట్కు బాధ్యత వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని దళిత,బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలుగా కోరుతున్నాము.కార్యక్రమంలోఅంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్విరాజ్, బి ఎస్ పి పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ పాలెం వెంకటయ్య, బి ఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ బండారి, అంబేద్కర్ యువజన సంఘం సలహాధారులు పోలప్ప, కే ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు విజయ్ కుమార్, డిటిఎఫ్ నాయకులు పరంధాములు, చంద్రశేఖర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తల్వార్ నరేష్ రవికుమార్ రమేష్ మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు
