పయనించే సూర్యుడు ( న్యూస్) జనవరి12 మక్తల్( రిపోర్టర్ సి తిమ్మప్ప )
ఉమ్మడిరాష్ట్రంలో ఇంతకన్నా వందరెట్ల అణచివేత
అయినా లెక్కచేసేది లేదు
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతోనే కాంగ్రెస్ నేతలు ఈ భౌతిక దాడులకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ నారాయణ పేట జిల్లా యువ నాయకులు గవినోళ్ళ నర్సింహారెడ్డి మండిపడ్డారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి, ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన మోసాలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, దాడులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. పదేండ్లపాటు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, నేడు అరాచకాలకు చిరునామాగా మారిందని, దాడులు,తమ మారు పాలన అని కాంగ్రెస్ మరోసారి నిరూపించుకుంటున్నదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు జుట్ల సాగర్ , శివా రెడ్డి ,పట్టణ యువ నాయకులు ,సాదిక్, కట్రెపల్లి కురుమూర్తి,పసుపుల భాస్కర్,చిన్నపొర్ల నర్సిములు,పాల్గొన్నారు.