
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 5 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి )
యాడికి:మండల సాక్షి విలేకరిగా పనిచేస్తున్న శ్రీనివాసులు గౌడ్ గత కొద్దిరోజుల క్రితం ద్విచక్ర వాహనంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి తన స్వగ్రామానికి శ్రీనివాసులు చేరుకున్నారు. శనివారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్ సిపిఐ నాయకులతో కలిసి చందన గ్రామానికి వెళ్లి శ్రీనివాసులు గౌడ్ ను పరామర్శించారు. కాలానుగుణంగా సమస్యలు వాటి అంతట అవే తప్పనిసరిగా సమసిపోతాయని, అధైర్య పడాల్సిన అవసరం లేదని సిపిఐ నాయకులు విలేఖరి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఓబిరెడ్డి, శ్రీరాములు, గరిడీ శివన్న బండారు రాఘవ, ఆదినారాయణ యాదవ్, చిన్న కుల్లాయి రెడ్డి సూరప్ప వెంకటరమణ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు