
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 26. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ : భావుసింగ్ నాయక్ కేసీఆర్ పాలనలో పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం చేరింది కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుంది.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గులాబీ తుపాను లో హస్తం కొట్టుకుపోతుంది ఏన్కూర్ మండలం కేంద్రంలో నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు కేసీఆర్ పాలనలో పల్లెల్లో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరాయని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తెలిపారు. ఏన్కూర్ మండలం కేంద్రంలో నందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం లోకి వచ్చి వాటి అమలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గులాబీ తుపాను లో హస్తం కొట్టుకుపోతుందన్నారు. హస్తం పాలనలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా మాయ మాటలు చెప్పి రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పార్టీ జెండా కార్యక్రమానికి ప్రతి గ్రామంలో నుంచి పార్టీ శ్రేణులతో పాటుగా, యువత ,రైతులు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీకి జన నిరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మండలం నాయకులు పొన్నం హరికృష్ణ, రేపలవాడ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు భూక్యా ధర్మ, భూక్యా వినోద్ కుమార్, యువజన పార్టీ అధ్యక్షుడు ఎస్కే బాజీ, ఏన్కూర్ మండలం అధ్యక్షుడు మైనార్టీ అధ్యక్షుడు చాంద్ పాషా, కాకటి దావీద్, పమ్మి శ్రీకాంత్, భూక్యా రాజేష్ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.