
పయనించే సూర్యుడుగాంధారి 29/04/25
గాంధారి మండల కేంద్రం లో సోమవారం రోజు సి హెచ్ సి లో అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ఈ సందర్బంగా అయినా మాట్లాడుతూ.. గర్భిణీలకు వైద్య పరీక్షల నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. గర్భిణీలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలని సూచించారు. రక్తహీనతలు తలెత్తకుండా పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో RBSK వైద్య సిబ్బంది గౌతమీ తదితరులు పాల్గొన్నారు