పయనించేసూర్యుడు.
న్యూస్.11.జనవరి.
పుల్కల్ ప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలొనిసింగూరులో నేటిరోజున
విద్యుత్ రంగంలో చేరి 25 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రస్తుతం యస్.యచ్.ఈ.యస్.సింగూర్ నందు విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు గుత్తా సురేష్ – బి ఆర్ బి.ఆనంద్ – కె వి ఎన్ ఎస్ వి.రాజు – వి.దుర్గా అశోక్” లు రజతోత్సవ వేడుకలను “కేక్” కట్ చేసి అత్యంత ఘనంగా నిర్వహించి అనంతరం ఉద్యోగులకు మరియు సిబ్బందికి భోజనాలను ఏర్పాటు చేసి ఆనందోత్సాహాల నడుమ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ఉద్యోగులుగా చేరాలని లక్ష్యంతో 1999 జేపీ ఏ నోటిఫికేషన్ ద్వారా 2000 సంవత్సరం జనవరిలో ఉద్యోగులుగా చేరడం అనంతరం ఉద్యోగ వృత్తిలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. నిబద్ధతతో ఉద్యోగ విధులు నిర్వహిస్తూ.. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ.. వివిధ హోదాలలో పదోన్నతులు పొంది అత్యున్నతంగా జీవనం కొనసాగిస్తున్నామని ఈ 25 సంవత్సరాలు మాకు అన్ని రకాలుగా సహకరించిన అధికారులకు, అనధికారులకు, సహచరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అన్నారు.
సంక్రాంతి సంబరాలను స్వాగతిస్తూ అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా స్థానిక ఏడీఈలు సౌజన్య, రాధిక, నాగేంద్ర గార్లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, ఉద్యోగ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, ఆర్టీజన్లు, కాంట్రాక్టు కార్మికులు, హయ్యర్ వెహికల్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.